పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : నల్గొండ-– వరంగల్– -ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని చర్చ్ కాంపౌండ్, గాంధీ చౌక్, నూతన మున్సిపాలిటీ ఆఫీస్, రోటరీ నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు నమోదు విధానంపై అవగాహన కల్పించారు. 

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనదని, ప్రతి పట్టభద్రుడు బాధ్యతగా ఓటరు నమోదులో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దీపక్ చౌదరి, ఎర్రం బాలగంగాధర్ తిలక్, పైడిపల్లి సత్యనారాయణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.