కబడ్డీ బరిలో పొంగులేటి సతీమణి.. క్రీడాకారిణులతో కలిసి కాసేపు సందడి

కబడ్డీ బరిలో పొంగులేటి సతీమణి..  క్రీడాకారిణులతో కలిసి కాసేపు సందడి
  • 72వ రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో ఆసక్తికర సన్నివేశం

సత్తుపల్లి, వెలుగు : కబడ్డీ కూతతో హోరెత్తుతున్న మైదానంలో ఓ ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సతీమణి మాధురమ్మ కాసేపు క్రీడాకారిణిగా మారి కబడ్డీ ఆడి సందడి చేశారు. సత్తుపల్లిలో శుక్రవారం మువ్వా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఆయన సతీమణి మాధురమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 రంగారెడ్డి, నల్లగొండ జట్లు ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరిన సందర్భంగా మైదానానికి చేరుకున్న మాధురమ్మ వారితో ముచ్చటించారు. అనంతరం ఉత్సాహంగా కబడ్డీ మైదానంలోకి దిగి క్రీడాకారిణులతో కలిసి కాసేపు ఆట ఆడారు. ఈ సన్నివేశం క్రీడాకారిణులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది.