- విలువ రూ.49,725 కోట్లు
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ బిలియనీర్ జేవియర్ నీల్..టెలికం కంపెనీ వోడాఫోన్ గ్రూప్‌లో 16.2 శాతం వాటా కొనడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఇలియాడ్ టెలికం వ్యవస్థాపకుడు జేవియర్ నీల్ తన కుటుంబ పెట్టుబడి సంస్థ వేగా ద్వారా ఈ వాటాను దక్కించుకోనున్నారు. ఈ ఒప్పందం ద్వారా వేగా వోడాఫోన్ గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారు అవుతుంది. ఈ డీల్ విలువ సుమారు 5.1 బిలియన్ యూరోలు (సుమారు రూ.49,725 కోట్లు) ఉంటుందని అంచనా. వేగాకు భారత్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేవు. ఇక్కడ వొడాఫోన్, ఐడియాతో కలిసి సేవలు అందిస్తోంది.
