జనవరి 25 నుంచి జనగణన..ఇంటింటి సర్వే షెడ్యూల్ విడుదల

జనవరి 25 నుంచి జనగణన..ఇంటింటి సర్వే షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: దేశంలో జనగణన ప్రక్రియ 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,718.24 కోట్ల బడ్జెట్‌‌ను ఆమోదించింది. ఈ సర్వే దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 7,092 ఉప జిల్లాలు, 5,128 పట్టణాలు, 4,580 సెన్సస్ టౌన్‌‌లు, అలాగే 6.39 లక్షల గ్రామాలను కవర్ చేయనుంది. షెడ్యూల్ ప్రకారం.. 2027 మార్చి 1 అర్ధరాత్రి 00:00 గంటలను రిఫరెన్స్ తేదీగా పరిగణించనున్నట్లు పేర్కొంది.

ఈసారి ప్రభుత్వం సరికొత్తగా ‘స్వీయ-గణన’ ఆప్షన్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందే, అంటే 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు ఎవరికి వారు ఆన్‌‌లైన్‌‌లో తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, విపరీతమైన మంచు కురిసే కొన్ని దుర్భర ప్రాంతాల్లో జనగణనను మినహాయించారు.