ఏపీ అసెంబ్లీలో 200 కులాలకు ప్రాతినిధ్యమే లేదు : మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు

ఏపీ అసెంబ్లీలో 200 కులాలకు ప్రాతినిధ్యమే లేదు : మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు
  • పాలకులు మారుతున్నా పేదల బతుకులు మారడం లేదు
  •  ఏలూరు, గుంటూరు ఎన్నికల్లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్ అభ్యర్థులను గెలిపించండి
  • మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులకు రాజకీయ వాటానే సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్) ప్రధాన లక్ష్యమని ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు అన్నారు. శుక్రవారం ఏపీలోని ఏలూరు, గుంటూరులలో నిర్వహించిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్ ఎన్నికల సన్నాహక సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏలూరు మేయర్ అభ్యర్థిగా బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డు గుర్తుపై పోటీ చేస్తున్న రిటైర్డ్ తహసీల్దార్ గుబ్బల నాగేశ్వరరావును, గుంటూరు 66వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెమెరా గుర్తుపై పోటీ చేస్తున్న బీమా రంగ మాజీ అధికారి డాక్టర్ రజినీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, అలాగే, 38వ వార్డులో గ్యాస్ సిలిండర్ గుర్తుపై పోటీ చేస్తున్న బి.శుక్లాను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

మురికివాడల్లో దుర్భర జీవితం

ఏలూరులో లక్షన్నర మంది, గుంటూరులో రెండు లక్షల మంది ప్రజలు మురికివాడల్లో దుర్భర జీవితం గడుపుతున్నారని పూర్ణచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్డీఎఫ్​కన్వీనర్​సాంశీరావు, నాయకుడు రమణయ్య, అభ్యర్థులు పాల్గొన్నారు.