ఇంటెన్స్ థ్రిల్లర్‌గా రాహుల్ విజయ్ కొత్త సినిమా ‘అ’ టైటిల్, ఫస్ట్ లుక్

ఇంటెన్స్ థ్రిల్లర్‌గా రాహుల్ విజయ్ కొత్త సినిమా ‘అ’ టైటిల్, ఫస్ట్ లుక్

రాహుల్ విజయ్ హీరోగా సాయి బాలి దర్శకత్వంలో   కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్న  ఇంటెన్స్  థ్రిల్లర్  ‘అ’. ఈ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌ను  రివీల్ చేయడంతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన అడివి శేష్ టీమ్‌‌‌‌‌‌‌‌కు  బెస్ట్ విషెస్  చెప్పాడు.  ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్ విజయ్  చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని కనిపిస్తున్నాడు. ఆయన చుట్టూ నేలంతా రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఈ ఇంటెన్స్ విజువల్‌‌‌‌‌‌‌‌కు బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో చార్మినార్ కనిపించడం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.  హైదరాబాద్ నేపథ్యంగా ఈ సినిమా రాబోతోందని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. దీనిపై   ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలను రాయడం సినిమాపై మరింత  ఆసక్తిని పెంచుతోంది.  అర్చన అయ్యర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.