హద్దు దాటితే చర్యలు తప్పవు.. కాంగ్రెస్ నేతలకు మల్లు రవి హెచ్చరిక

హద్దు దాటితే చర్యలు తప్పవు.. కాంగ్రెస్ నేతలకు మల్లు రవి హెచ్చరిక
  •     పీసీసీ క్రమశిక్షణకమిటీ చైర్మన్​మల్లు రవి    

అచ్చంపేట, వెలుగు: పార్టీ నేతలు ఏ స్థాయిలో, ఏ హోదాలో  ఉన్నా హద్దు దాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి హెచ్చరించారు. పార్టీ విధానాలను, ప్రభుత్వ పనితీరును తప్పుబట్టేలా వ్యాఖ్యలు చేస్తే క్షమించేదిలేదని స్పష్టం చేశారు. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ క్రమశిక్షణ, విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.  

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల ప్రభుత్వ పనితీరుపై బహిరంగంగా విమర్శలు చేసినట్టు  పార్టీ పెద్దల నుంచి  ఫిర్యాదులు అందాయని, ఈ  విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్‌‌‌‌‌‌‌‌తో చర్చించినట్లు  తెలిపారు. ఏఐసీసీ ఇన్​ చార్జి సందీప్ దృష్టికి సైతం ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినట్టు,  పొలిటికల్ అఫైర్స్ కమిటీ  సమావేశంలోనూ చర్చించనున్నట్టు  తెలిపారు. మీడియా సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.