కాశీబుగ్గ, వెలుగు : పట్టణంలోని భద్రకాళి అమ్మవారిని ఆదివారం త్రిపుర రాష్ర్ట గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. గవర్నర్కు ఆలయ మహామంపడపంలో అర్చకులు, వేదపండితులు మహాదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి ప్రసాదం అందజేశారు. ఆ తర్వాత చిన్నజీయర్స్వామితో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ అధ్యక్షుడు గంటా వికుమార్, భక్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
