ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్లో హాస్టళ్లు నిర్మించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్లో హాస్టళ్లు నిర్మించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: మియాపూర్‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 850 ఎకరాల భూములను అమ్మొద్దని, వాటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు నిర్మించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. సీఎం రేవంత్​రెడ్డి హయాంలో విలువైన భూములను సర్కారు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోషలిస్టు విద్యార్థి సంఘం, బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలో 325 బీసీ కాలేజీ హాస్టళ్లు ఉన్నప్పటికీ ఒక్క దానికీ సొంత భవనం లేకపోవడం విచారకరమన్నారు. అద్దె భవనాల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, నాయకులు రాజేందర్, నీల వెంకటేశ్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.