డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం : ఎంపీ కె. లక్ష్మణ్

డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం : ఎంపీ కె. లక్ష్మణ్
  • యువత వాటికి దూరంగా ఉండాలి
  • బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ పిలుపు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యమని రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ తెలిపారు.  డ్రగ్స్ యువత భవిష్యత్తును, కుటుంబాల ప్రశాంతతను, సమాజ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని, యువత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ సందేశంతో అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 కిలోమీటర్ల సైక్లింగ్ ర్యాలీ జరిగింది.

అంబేద్కర్ యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కేబుల్ బ్రిడ్జి మీదుగా హైటెక్స్ మెయిన్ గేట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, కుటుంబ వ్యవస్థను, సామాజిక భద్రతను, దేశ అభివృద్ధిని ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య అని తెలిపారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.