కోణార్క్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌లో గంజాయి పట్టివేత

కోణార్క్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌లో గంజాయి పట్టివేత
  •     రూ. రూ.4 లక్షల విలువైన 8 కిలోల ఎండు గంజాయి స్వాధీనం 

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కోణార్క్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైలులో తరలిస్తున్న 8 కిలోల ఎండు గంజాయిని మహబూబాబాద్ ఎక్సైజ్, టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ బి. రాంప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కరంచంద్ పర్యవేక్షణలో ఆదివారం ఉదయం సుమారు 6.30 గంటలకు ఎక్సైజ్, టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ సిబ్బంది కలిసి కోణార్క్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించగా, రూ.రూ.4 లక్షల విలువైన 8 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది.

ఈ గంజాయి ఎవరికి చెందినది, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలు ఇంకా తెలియలేదు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్​ ఇన్​స్పెక్టర్​ తెలిపారు.ఈ తనిఖీల్లో మహబూబాబాద్ ఎక్సైజ్ సబ్‌‌‌‌‌‌‌‌ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ సంతోష్, హెడ్ కానిస్టేబుల్ లలితారాణి, సిబ్బంది 
పాల్గొన్నారు.