హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఆగస్టు 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఇది కేవలం ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదని, ఎన్నో భావోద్వేగాలు ఉన్న సినిమా అని నటీనటులు అన్నారు. కథే హీరోగా ఈ సినిమా తీశామని, ప్రేక్షకులు కొన్న టికెట్ ధరకు న్యాయం చేసేలా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్‌గా, శివ శర్వాణి ఎడిటర్‌గా వ్యవహరించగా శేఖర్ మోపురి సంగీతాన్ని అందించాడు.
