- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలతో దిగొచ్చిన ఆరు కంపెనీలు
న్యూఢిల్లీ: వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్న లేబుల్స్‌ను ఆరు కంపెనీలు తొలగించాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఫలితంగా లివ్యోర్ తమ 'రోస్టెడ్ ఎడమామే బీన్స్' ప్యాకింగ్‌పై నిబంధనలకు విరుద్ధంగా ముద్రించిన 'వీగన్ అండ్ హెల్తీ' లేబుళ్లను తొలగించింది. హానెస్ట్ ఇన్నోవేషన్స్, హీలియోస్టోన్ స్పెషాలిటీస్ కంపెనీలు కూడా తప్పుదోవ పట్టించే తమ ట్రేడ్‌మార్క్‌లను మార్చుకున్నాయి. రాజస్థాన్ ఆగ్రో అండ్ జనరల్ ఇండస్ట్రీస్ అన్ని రకాల తప్పుదోవ పట్టించే క్లెయిమ్‌లను తొలగించింది. ఐయోటా నానోటెక్నాలజీ తమ లేబుల్స్‌ను సవరించగా,పంచామృత ఇండస్ట్రీస్ తమ వివాదాస్పద ఎలక్ట్రోలైట్ డ్రింక్‌ను తన వెబ్‌సైట్ నుంచి తీసేసింది.
