ముషీరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1వరకు బధిరులకు క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చిరంజీవి, వల్లభనేని ప్రసాద్ మాట్లాడుతూ బధిరుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బధిరులను క్రికెట్ ప్రోత్సహించి, జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ 28 నుంచి ఈ పోటీలు రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో వీకే జయప్రకాశ్, కాటమొని వెంకటేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
