హంగేరీలో బస్సు బోల్తా.. 12 మంది మృతి..10 మందికి తీవ్ర గాయాలు

హంగేరీలో బస్సు బోల్తా.. 12 మంది మృతి..10 మందికి తీవ్ర గాయాలు

బుడాపెస్ట్‌‌‌‌‌‌‌‌: హంగేరీలో బస్సు బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలయ్యాయి. పోలాండ్​పర్యాటకులతో వెళ్తున్న బస్సు బుడాపెస్ట్‌‌‌‌‌‌‌‌కు 140 కిలోమీటర్ల దూరంలోని మెజోకెరెష్టెస్‌‌‌‌‌‌‌‌ సమీపంలో ఎం3 హైవేపై ప్రమాదానికి గురైంది. 

బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. డ్రైవర్‌‌‌‌‌‌‌‌ నిద్రలోకి జారుకోవడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. 

బస్సు బోల్తాపడడంతో పలువురు ప్రయాణికులు దాని కింద చిక్కుకున్నారు. బస్సులో ఉన్న వారంతా పోలండ్‌‌‌‌‌‌‌‌ పౌరులేనని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనపై పోలెండ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు కరోల్‌‌‌‌‌‌‌‌ నవ్రోక్కీ, ప్రధాని పీటర్‌‌‌‌‌‌‌‌ మగియార్‌‌‌‌‌‌‌‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.