జూలూరుపాడును సస్యశ్యామలం చేస్తా: వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

జూలూరుపాడును సస్యశ్యామలం చేస్తా: వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ప్రతి చెరువును గోదావరి నీటితో నింపి సస్యశ్యామలం చేస్తానని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని సీతారామ ప్రాజెక్టు గోదావరి నీటిని కాలువ ద్వారా కాకర్ల ఎర్ర చెరువుకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని మిగిలిన చెరువులకు కూడా నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం కాకర్ల గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మంగీలాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.