- మెట్రో, ఆర్టీసీ, ఆటోలు, క్యాబ్‌లతో లింక్
- ముందుగా 51 స్టేషన్లను డెవలప్చేయాలని నిర్ణయం
హైదరాబాద్సిటీ, వెలుగు: ప్రైవేట్వాహనాలతో నగరంలో ట్రాఫిక్సమస్య రోజు రోజుకూ పెరుగుతుండడంతో పబ్లిక్ట్రాన్స్పోర్ట్ను ప్రజలకు మరింత చేరువ చేయాలని చూస్తోంది హుమ్టా. ఇందులో భాగంగా ప్రయాణికుడి లాస్ట్మైల్కనెక్టివిటీ అందించడానికి ఎంఎంటీఎస్, మెట్రోరైల్, ఆర్టీసీ, ఆటోలు, క్యాబ్‌లను లింక్‌చేయాలని భావిస్తోంది. మొదటి దశలో 51 ఎంఎంటీఎస్ స్టేషన్లను ఆధునిక మల్టీ-మోడల్ ట్రాన్సిట్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అనేక ఎంఎంటీఎస్స్టేషన్ల వద్ద సమస్యలున్నాయి.
సరైన ఫుట్‌పాత్‌లు లేవు. పార్కింగ్ సమస్యతో పాటు స్టేషన్లకు దూరంగా బస్టాప్‌లు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఎంఎంటీఎస్స్టేషన్ను మెట్రో, బస్సు, ఆటో, క్యాబ్‌తో లింక్‌చేసి మొబిలిటీ హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. పాదచారుల కోసం ఫెసిలిటీస్ఏర్పాటు చేయడంతో పాటు వాక్‌వేలు, పార్కింగ్, పికప్ -డ్రాప్ జోన్లు, బస్ బేలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. స్టేషన్ల చుట్టుపక్కల భూములను గుర్తించి బస్ టెర్మినల్స్ అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం డీపీఆర్, స్టేషన్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్లను సిద్ధం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నది.
