న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్దదైన ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐసీఐఏ) తమ యాన్యువల్ ప్యాసింజర్ హ్యాండ్లింగ్ కెపాసిటీని ప్రస్తుతమున్న 10.6 కోట్ల (106 మిలియన్ల) నుంచి 12.5 కోట్లకు (125 మిలియన్లు) పెంచనుంది. ఇందుకు సంబంధించి 10 ఏళ్ల మాస్టర్ ప్లాన్‌ను జీఎంఆర్ నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డయల్) సిద్ధం చేసింది. తొలి దశలో భాగంగా ఏప్రిల్ 2030 నాటికి సామర్థ్యాన్ని 11.6 కోట్లకు, 2032 నాటికి 12.5 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోటి మంది ప్రయాణికుల సామర్థ్యంతో టర్మినల్3లో కొత్తగా పియర్ (కారిడార్)–ఈని ఏర్పాటు చేస్తారు.
