అక్రమంగా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల విక్రయం..ముగ్గురు అరెస్ట్, మరొకరు పరార్

అక్రమంగా మెఫెంటెర్మైన్  సల్ఫేట్ ఇంజెక్షన్ల విక్రయం..ముగ్గురు అరెస్ట్, మరొకరు పరార్

చార్మినార్,​ వెలుగు: ఫలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుమా పోలీస్​స్టేషన్​ పరిధిలోని నవాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాహెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కుంటలో మెఫెంటెర్మైన్  సల్ఫేట్  ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. 110 మెఫెంటెర్మైన్  సల్ఫేట్  ఇంజెక్షన్  వాయిల్స్, 25 సిరంజీలు, 3 మొబైల్  ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

 ఫలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుమా నవాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాహెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కుంటకు చెందిన మహ్మద్  ఐజాజ్, మహ్మద్  జుబేర్  అలియాస్  జుబైర్, మహ్మద్  సైఫ్ ఖాన్  అరెస్ట్  అయిన వారిలో ఉన్నారు. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన శుభం రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుత్  పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 జుబేర్  ఇండియా మార్ట్  ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంజెక్షన్లను ఆర్డర్  చేసి, థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ కొరియర్  సర్వీసుల ద్వారా తెప్పించుకున్నట్లు చెప్పారు. ఒక్కో ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 ఇంజెక్షన్లను రూ.5 వేలకు కొనుగోలు చేసి, ఒక్కో ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.వెయ్యి చొప్పున అమ్ముతున్నట్లు తేలిందన్నారు. మహ్మద్  ఐజాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గతంలో పలు పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్లలో కేసులు ఉండగా, మహ్మద్  జుబేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై డ్రగ్  కేసు నమోదైనట్లు తెలిపారు.