హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో నిర్వహించిన ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ ఆదివారం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఉత్సాహంగా జరిగింది. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ జెండా ఊపి ‘మన రన్–2026’ను ప్రారంభించారు.
వివిధ కేటగిరిల్లో నిర్వహించిన రన్‌లో పిల్లలు, యువత, సీనియర్ సిటిజన్లు సుమారు 5 వేల మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సీపీ మాట్లాడుతూ యువత ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో న్యూస్ 18 డిప్యూటీ ఎడిటర్ పీవీ రమణ కుమార్, నిర్వాహకులు పాల్గొన్నారు.
