మనిషిని ఉద్యోగంలోంచి తీసేసిన ఏఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మనిషిని ఉద్యోగంలోంచి తీసేసిన ఏఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •    23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చిండని వేటు
  •     ప్రపంచంలో తొలిసారి ఘటన

శాన్‌‌‌‌‌‌‌‌ఫ్రాన్సిస్కో: ప్రతిరోజూ డ్యూటీకి ఆలస్యంగా వస్తున్న ఓ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌ని ఏఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగంలోంచి తీసేసింది. నెల మొత్తంలో ఆయన వచ్చిన 23 రోజుల్లో 17 సార్లు లేటుగా వచ్చాడని, ఆయనను తొలగించడమే సరైనదంటూ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు సిఫార్సు చేసింది. శాన్‌‌‌‌‌‌‌‌ఫ్రాన్సిస్కోలోని ఆండన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ను నడిపిస్తున్న లూనా అనే ఏఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఏఐ సూచనను పరిశీలించిన తర్వాత కంపెనీ అధికారులు ఆ ఉద్యోగిని తొలగించారు. అయితే, ప్రపంచంలో ఒక ఏఐ బాస్‌‌‌‌‌‌‌‌ మనిషిని ఉద్యోగం లోంచి తీసేయమని చెప్పడం ఇదే ఫస్ట్​ టైమ్​ కావడం విశేషం.

ఏఐ బాస్‌‌‌‌‌‌‌‌ సంగతేందంటే..

ఏఐకి నిజమైన వ్యాపార నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందో పరీక్షించేందుకు అమెరికాకు చెందిన ఆండన్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీ నిర్వాహకులు శాన్‌‌‌‌‌‌‌‌ఫ్రాన్సిస్కోలో ‘ఆండన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌’ను ఏర్పాటు చేశారు. ఆ మార్కెట్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ బాధ్యతలను అదే కంపెనీ రూపొందించిన లూనా అనే ఏఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో పెట్టారు. దీంతో బాధ్యతలు టేకాఫ్‌‌‌‌‌‌‌‌ చేసిన లూనా.. పుస్తకాలు, కొవ్వొత్తులు, ఆర్ట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లు, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, తదితర వస్తువులను విక్రయించే ఆ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  స్టాక్‌‌‌‌‌‌‌‌ ఎంపిక, ధరల నిర్ణయం, స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమింగ్స్‌‌‌‌‌‌‌‌, ఉద్యోగుల నియామకం వంటి అంశాలను పర్యవేక్షించింది. 

రూల్స్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసింది.. ఆపై మర్చిపోయింది

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగుల హాజరుకు సంబంధించిన నిబంధనలను కొన్ని నెలల కిందట లూనానే రూపొందించింది. ఆ తర్వాత ఆ రూల్​ను మర్చిపోయింది. ఇది గమనించిన ఆండన్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు.. ‘చర్యలు తీసుకోవట్లేదేంటి?’ అని అడిగేసరికి లూనా అలర్ట్‌‌‌‌‌‌‌‌ అయింది. ఆ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌ని ఉద్యోగం నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. దీనిని విశ్లేషించిన ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌ సీఈవో లూకాస్‌‌‌‌‌‌‌‌ పీటర్సన్‌‌‌‌‌‌‌‌.. ఏఐ వ్యవస్థలో లోపాలున్నాయని నిర్ధారించారు. ఏఐ సామర్థ్యాలు ఎంత పెరుగుతున్నా.. ఫిజికల్‌‌‌‌‌‌‌‌ యాక్టివిటీస్‌‌‌‌‌‌‌‌ కోసం మనుషులపై ఆధారపడాల్సిందేనని స్పష్టం చేశారు.