పోలీసు శాఖలో150 ఎస్‌‌పీఓ పోస్టులు..మాజీ సైనికులు, పారామిలిటరీ, రిటైర్డ్ పోలీసులకు అవకాశం

పోలీసు శాఖలో150 ఎస్‌‌పీఓ పోస్టులు..మాజీ సైనికులు, పారామిలిటరీ, రిటైర్డ్ పోలీసులకు అవకాశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న150 ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్‌‌పీఓ) పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పోలీసు శాఖ పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 26 వేల  గౌరవ వేతనం చెల్లించనున్నారు. 

మాజీ సైనికుల వయస్సు ఆగస్టు 31, 2026 నాటికి 58 ఏండ్ల కంటే తక్కువ ఉండాలన్నారు. మాజీ పారామిలటరీ, రిటైర్డ్ పోలీసు సిబ్బంది గత రెండేండ్లలోనే రిటైర్మెంట్ తీసుకుని ఉండాలన్నారు. 62 ఏండ్ల వరకు ఉన్నా పర్వాలేదన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో పేట్ల బుర్జు సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌‌లో ఉన్న ఎస్‌‌పీఓ ఆఫీసుకు హాజరై దరఖాస్తు చేసుకోవాలన్నారు. చివరి తేదీ ఆగస్టు 25గా ప్రకటించారు.