న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్లలో తాగునీటి క్వాలిటీపై కాగ్ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ అలర్ట్ అయింది. ప్రయాణికులకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారులను ఆదేశించారు.
రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓతో పాటు ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లోని సుమారు 20 వేల ప్రాంతాల్లో ‘ట్యాంక్ టు ట్యాప్’ వాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
