లక్నో: వారణాసి ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో తుపాకీ పేలుడు.. ఇద్దరికి గాయాలు

లక్నో:  వారణాసి ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో తుపాకీ పేలుడు.. ఇద్దరికి గాయాలు

లక్నో: వారణాసి ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో ఆదివారం తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికుడి వద్ద ఉన్న తుపాకీని తనిఖీ చేస్తుండగా అది పేలడంతో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు డైరెక్టర్ పునీత్ గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం.. యూపీలోని ఆజంగఢ్‌‌‌‌కు చెందిన ప్రయాణికుడు తన భార్యతో  కలిసి ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌ప్రెస్ ప్లైట్‌‌‌‌లో ముంబై వెళ్లేందుకు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు వచ్చాడు. 

రూల్స్ ప్రకారం అతడు తన వద్ద ఉన్న లైసెన్స్‌‌‌‌డ్ పిస్టల్ వివరాలను ముందే వెల్లడించాడు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు భద్రతా సిబ్బంది ఆ తుపాకీని, దానికి సంబంధించిన పత్రాలను చెక్ చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా పిస్టల్ నుంచి బుల్లెట్ ఫైర్ అయి, నేలకు తగిలి రివర్స్‌‌‌‌లో వచ్చింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.