మల్కాజిగిరి పరిధిలో కల్తీ పాల ఉత్పత్తుల గుట్టురట్టు..1,120 కేజీల పెరుగు, 58 కేజీల కోవా స్వాధీనం

మల్కాజిగిరి పరిధిలో కల్తీ పాల ఉత్పత్తుల గుట్టురట్టు..1,120 కేజీల పెరుగు, 58 కేజీల కోవా స్వాధీనం

హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి పరిధిలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పాల ఉత్పత్తుల దందాను ఎం-ఫాస్ట్ టీమ్-, ఎస్‌‌‌‌‌‌‌‌వోటీ పోలీసులు ఛేదించారు. జవహర్‌‌‌‌‌‌‌‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మశాలి టౌన్‌‌‌‌‌‌‌‌షిప్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని తనిఖీ చేయగా, ఎలాంటి లేబుళ్లు, తయారీ, గడువు తేదీలు లేని పెరుగు, కోవా, కలాకంద్‌‌‌‌‌‌‌‌ కనిపించింది. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఎన్‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌లో శ్రీ నందిని డెయిరీ పేరుతో నడుస్తున్న తయారీ కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. 

అపరిశుభ్ర వాతావరణంలో మిల్క్ పౌడర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర రసాయన పదార్థాలను ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున కల్తీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 1,120 కేజీల పెరుగు, 58 కేజీల కోవా, కలాకంద్, 30 కేజీల మిల్క్ పౌడర్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎస్. రామచందర్, లక్ష్మయ్యను అరెస్ట్​చేశారు.