హైదరాబాద్ సిటీ: ఆగస్టు19న బ్యాటరీ వ్యర్థాల నిర్వహణపై వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్

హైదరాబాద్ సిటీ: ఆగస్టు19న బ్యాటరీ వ్యర్థాల నిర్వహణపై వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్

హైదరాబాద్ సిటీ, వెలుగు : టీజీపీసీబీ, ఐఐటీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి ఆగస్టు 19న సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయిన్ ఆఫీసులో పవరింగ్ సర్క్యులారిటీ ఈపీఆర్ ద్వారా ‘బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ– కీలక ఖనిజాల పునరుద్ధరణ’  అనే అంశంపై ఒకరోజు వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నది. ఉదయం10 గంటలకు రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమయ్యే ఈ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్ సాయంత్రం 5  గంటల వరకు కొనసాగనున్నది.