జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో బస్సులో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు.
క్షతగాత్రులను చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ డిపో కు చెందిన బస్సు నిజామాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
