భారీగా తగ్గిన చికెన్ ధరలు.. హైదరాబాద్లో కిలో ధర ఇంత చీప్ అయిందేంటి..?

భారీగా తగ్గిన చికెన్ ధరలు.. హైదరాబాద్లో కిలో ధర ఇంత చీప్ అయిందేంటి..?

చికెన్ ధరలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. జులై చివరి వారంలో స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్మారు. ప్రస్తుతం అదే చికెన్ రూ.220–240 మధ్య లభిస్తోంది. ప్రాంతం, నాణ్యత, కటింగ్ చార్జీలను అనుసరించి ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటోంది.

లైవ్ చికెన్ ధరలు కూడా తగ్గుముఖం పట్టినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ మాసంలో పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కారణంగా పలువురు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో చికెన్కు డిమాండ్ తగ్గి.. రిటైల్ మార్కెట్లో ధరలు దిగివచ్చాయి. ముఖ్యంగా వారాంతాల్లో కూడా కొనుగోళ్లు తగ్గడం ధరలపై మరింత ప్రభావం చూపుతోంది.

డిమాండ్ తగ్గినా కోళ్ల సరఫరా కొనసాగుతుండటంతో మార్కెట్లో ధరలపై ఒత్తిడి ఏర్పడుతోంది. ఫీడ్ ధరలు, రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయం వంటి అంశాలతోపాటు ప్రస్తుతం డిమాండ్ సరఫరా సమతుల్యత కూడా చికెన్ ధరలను ప్రభావితం చేస్తోంది. డిమాండ్ మరింత తగ్గితే ధరలు ఇంకాస్త దిగివచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

శ్రావణ మాసం ముగిసిన తర్వాత మాంసాహార వినియోగం సాధారణ స్థాయికి చేరితే చికెన్కు డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. దీంతో ధరలు కూడా తిరిగి పుంజుకునే అవకాశముందని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం శ్రావణమాసం ప్రభావంతో చికెన్ మార్కెట్లో ధరలు భారీగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది.