హైదరాబాద్: తెలంగాణ SIR డ్రాఫ్ట్ జాబితా 2026లో పేర్లను ఎలా చూసుకోవాలనే విషయంలో చాలా మందికి సందేహాలున్నాయి. అయితే.. సులభంగానే పేరు చూసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణలో SIR ముసాయిదా జాబితాను సోమవారం విడుదల చేశారు. మొత్తం 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామని, సెప్టెంబర్ 16లోగా వారు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ముసాయిదా జాబితాలోని పేర్లను సరిచూసుకోవడానికి, ఓటరు ముందుగా కొత్త బూత్ నంబర్‌ను తెలుసుకోవాలి.
హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో, చాలా మంది ఓటర్ల పాత బూత్ నంబర్ మారిన సంగతి తెలిసిందే. అందువల్ల.. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరును సరిచూసుకోవడానికి, ఓటర్లు ముందుగా తమ కొత్త బూత్ నంబర్‌ను గుర్తించుకోవాలి. దీనిని ECI సెర్చ్ పోర్టల్లో తెలుసుకోవచ్చు. ఓటర్లు తమ పోలింగ్ బూత్ నంబర్‌ను తెలుసుకోవడానికి, తమ EPIC నంబర్‌ను నమోదు చేసి తెలుసుకోవచ్చు. లేదంటే.. తమ పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలతో కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత ECI వెబ్‌సైట్‌ను నుంచి బూత్ నంబర్‌కు సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
►ALSO READ | 22A అధికారుల తప్పిదమే.. ఆ భూములను ప్రొహిబిటెడ్ లిస్టునుంచి తొలగిస్తాం: మంత్రి పొంగులేటి
ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకునేందుకు వీలుగా మీసేవ సెంటర్లు, ఆన్లైన్ పోర్టల్స్ అందుబాటులో ఉంచారు. జాబితాలో పేర్లు లేని అర్హులు ఫారమ్-6 ద్వారా నూతన నమోదుకు, తప్పులు ఉన్నవారు ఫారమ్-8 ద్వారా సవరణలకు, అలాగే అర్హత లేని ఓట్ల తొలగింపుకు ఫాం-7 ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. తొలగింపులో ఉన్న ఓటర్లలో మొత్తం 73 లక్షలు ఉండగా అందులో మరణించిన వారివి, ఇప్పటికే ఎన్రోల్ అయిన వాటిలో అర్హులు ఎవరు ఉండరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాటిని నిశితంగా పరిశీలించి, వెరిఫై చేసుకున్న తరువాతే తీసేస్తున్నట్లు చెబుతున్నారు.
