తెలుగు రాష్ట్రాల్లో విద్యా రంగంలో ఉన్న నారాయణ స్కూల్స్ తన ప్రస్థానాన్ని మరింత విస్తరిస్తున్నాయి. 1985లో స్థాపించబడిన నారాయణ స్కూల్స్.. తెలంగాణలో విద్యార్థులకు మరింత చేరువయ్యేందుకు మరో ఐదు కొత్త స్కూల్ క్యాంపస్‌లను ప్రారంభించాయి. ఇందులో నాలుగు హైదరాబాద్‌లో కాగా, మరో క్యాంపస్ నిజామాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి.
నిజామాబాద్‌లో ప్రారంభమైన కొత్త క్యాంపస్‌లో హాస్టల్ వసతితో పాటు సీబీఎస్ఈ (CBSE) కరిక్యులమ్‌ను అందిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త క్యాంపస్‌లలో స్టేట్ బోర్డ్ సిలబస్ ప్రకారం బోధన కొనసాగనుంది. ఈ నూతన క్యాంపస్‌లన్నింటిలోనూ డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, వయస్సుకు తగిన బోధనా పద్ధతులను అమలు చేస్తున్నారు.
ఈ తాజా విస్తరణతో తెలంగాణలో నారాయణ స్కూల్స్ సంఖ్య 120కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే నారాయణ స్కూల్స్ నెట్‌వర్క్ 574 క్యాంపస్‌లకు విస్తరించింది.
