బీజేపీ నేషనల్ టీంలో బిగ్ ఛేంజెస్.. సంస్థాగతంగా కీలకమైన సోషల్ మీడియా టీంలో భారీ మార్పులు చేసింది అధిష్టానం. సోషల్ మీడియా జాతీయ కన్వీనర్ గా ఛత్తీస్ గఢ్ కు చెందిన దీపక్ మాస్కేను నియమించింది. గత 12ఏళ్లుగా సోషల్ టీంను నడిపించిన అమిత్ మాల్వియాను తొలగించి ఆయన స్థానంలో దీపక్ మాస్కైని నియమిచడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న క్రమంలో బీజేపీ ఈ కీలక నియమకాలను చేపట్టినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీపక్ మాస్కేను సోషల్ మీడియా చీఫ్ గా నియమించడం బీజేపీ టీంలో కీలక మార్పును సూచిస్తుంది. టెక్నాలజీ, ఎన్నికల డేటా, ఫీల్డ్ క్యాంపెయిన్ లో మంచి అనుభవం ఉన్న నేతగా దీపక్ మాస్కేకు పేరుంది. అయితే ఎక్కువ కాలం కీలకమైన పదవిలో కొనసాగిన అమిత్ మాల్వీయాను తొలగించి ఆయనస్థానంలో దీపక్ మాస్కైను నియమించడం పెద్ద చర్చకు దారి తీసింది.
►ALSO READ | షాకింగ్ ఘటన.. బంగారం కోసం ఐపీఎస్ అధికారి తల్లిని చంపేశారు !
ఎవరీ దీపక్ మస్కే..
రాయ్‌పూర్‌కు చెందిన సీనియర్ బీజేపీ నేత దీపక్ మస్కే. వృత్తిరీత్యా కెమిస్ట్రీ లెక్చరర్ అయిన మస్కే.. ఎమ్మెస్సీ తోపాటు సిమెంట్ టెక్నాలజీతో టెక్నాలజీ డిప్లామా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో పట్టా పొందారు. పార్టీలో ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం, ఎన్నికల డేటా స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ , ఫీల్డ్ ఎక్స్ పీరియెన్స్, వంటి స్కిల్స్ తో దీపక్ మస్కేను సోషల్ మీడియా చీఫ్ గా నియమించిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీపక్ మస్కే ఛత్తీస్‌గఢ్ బీజేపీలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడు కూడా.
సోమవారం (ఆగస్టు17)బీజేపీ అధిష్టానం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మంది సీనియర్ నేతలను నియమించింది. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింధియా, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌లతో పాటు మరికొందరు సీనియర్ నేతలను పార్టీ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది.
