తల్లి ప్రేమ.. తండ్రి రుణం .. ఇవి వారి దేహం వదిలినా వీడని బంధం.. మనకు జన్మనిచ్చి.. సమాజంలో బతకడం నేర్పిన తండ్రి.. తాత.. ముత్తాత వంటి పూర్వీకుల రుణం తీర్చుకొనేందుకు బీహార్ కు విదేశీయులు క్యూ కట్టారు. మహాలయ పక్షాల అక్టోబర్ 10వరకు కొనసాగుతాయి.
బిహార్‌లోని గయలో జరుగుతున్న పితృపక్ష కార్యక్రమాల్లో విదేశీ పర్యాటకులు కూడా పాల్గొని పిండ ప్రదానం, పితృకర్మలు నిర్వహించారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలపై ఆసక్తితో గయకు వచ్చిన వారు స్థానిక పండితుల మార్గదర్శకత్వంలో పితృదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.
గయలో పితృకర్మలకు ఉన్న విశిష్టతతో పాటు, విదేశీయులు సంప్రదాయ పద్ధతుల్లో పిండ ప్రదానం చేయడం అక్కడి భక్తులు, సందర్శకుల దృష్టిని ఆకర్షించింది.పితృపక్ష సమయంలో గయకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు, ఆధ్యాత్మిక పర్యాటకులు వస్తుంటారు.
బీహార్‌లోని గయలోని ఫల్గునది ఒడ్డున పితృ పక్షాల జాతర కొనసాగుతుంది. పితృదేవతల ఆత్మకు సంతృప్తి కలగాలని జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, ఘనా వంటి దేశాల నుండి అనేక మంది విదేశీయులు వచ్చారు. విదేశీయులు ఫల్గు నదీ తీరంలో పితృదేవతల కార్యక్రమాలు నిర్వహించారు. మరణించిన పూర్వీకుల ఆత్మలకు శాంతి, మోక్షం (ముక్తి) లభించేందుకు మహాలయపక్షాల్లో పిండదానం.. తర్పణాలు వదులుతారు.
పితృ పక్షం సందర్భంగా 'పిండ దానం' చేయడానికి జర్మనీ, రష్యా వంటి దేశాల నుండి విదేశీయులు బీహార్‌లోని గయలోని గంగానది ఒడ్డుకు తరలివచ్చారు.చీరలు, ధోతీ-కుర్తాల వంటి సంప్రదాయ భారతీయ దుస్తులను ధరించి, ఈ యాత్రికులు పవిత్ర స్థలంలో ప్రార్థనలు చేశారు . పితృదేవతలకు పిండప్రదానం చేసి తర్పణాలు వదిలారు.
అక్టోబర్ 10 వరకు జరిగే పితృపక్షాల సమయంలో పూర్వీకులకు పూజించాలని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని పవిత్రనదీతీరంలో చేస్తే చాలా మంచిదని పండతులు చెబుతున్నారు.
విదేశాల నుంచి యాత్రికులు భారతీయ సంప్రదాయంగా చీరలు, ధోతీ-కుర్తాలను ధరించి పితృదేవతలను స్మరించుకొని తర్ఫణాలు వదాలారు.
ఇటలీ, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్ మరియు నెదర్లాండ్స్ వంటి అనేక ఐరోపా దేశాల నుండి భక్తులు ఇక్కడ ఆచారాలు నిర్వహించడానికి వచ్చారు. మూడు బృందాలుగా 48 మంది గయకు వచ్చారు. ఇటలీలోని మిలన్ నుంచి మొదటిసారిగా వచ్చిన నటాలియా, గయా జీలో తన పూర్వీకులను ఆరాధించే అవకాశం లభించినందుకు కృతజ్ఞతతో ఉన్నానని తెలిపారు..
స్థానిక పండితులు మంత్రాలు చదువుతుంటే పూర్తి శ్రద్ధాభక్తులతో అర్ఘ్యం అర్పిస్తూ తర్పణాలు వదులుతూ పిండప్రదానం చేశారు. వారి కళ్లలో కనిపించిన ఆర్ద్రత, తమను విడిచివెళ్లిన పెద్దల పట్ల ఉన్న అమితమైన ఆరాధన అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పరవశింపజేసింది.
