22A నిషేధిత భూముల లిస్టుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పొరపాటు కొందరు ప్రైవేట్ వ్యక్తులు భూములు 22A నిషేధిత భూముల లిస్టులో పడ్డాయి.. ఇది మా అధికారుల తప్పిదమే.. ఆందోళన చెందాల్సిన అసవరం లేదు.. ప్రభుత్వం ఎవరి భూములను లాక్కోదు..త్వరలో ఆ భూములను ప్రొహిబెటెడ్ లిస్టు నుంచి తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
సోమవారం (ఆగస్టు 17) 22A నిషేధిత భూముల లిస్టుపై మంత్రి పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. తమ భూములను 22A నిషేధిత భూముల లిస్టులో పెట్టారని హైదరాబాద్ సిటీ సహా రంగారెడ్డి, మేడ్చల్ నుంచి మొత్తం 757 మంది ఫిర్యాదు చేశారని అన్నారు.వీటిలో ఎక్కువగా మేడ్చల్ నుంచి 511 అప్టికేషన్లు, రంగారెడ్డి జిల్లాలో 148 అప్లికేషన్లు వచ్చాయన్నారు. అల్విన్ కాలనీలోనూప్రైవేట్ వ్యక్తుల భూములు 22A లో పడ్డాయన్నారు. సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి IG స్థాయి వరకు రివ్యూ చేసి గ్రౌండ్ రియాలటి ఏమిటనది తెలుసుకున్నాం.. కొందరు ప్రైవేట్ వ్యక్తుల భూములు 22A నిషేధిత భూముల లిస్టులపడ్డాయని గుర్తించామన్నారు పొంగులేటి.
ఫిర్యాదు దారుల 510 అప్లికేషన్లలో 320 అప్టికేషన్లు ULC కి సంబంధించినవి..ESD క్లియర్ చేసిన అప్లికేషన్లు రిజనబుల్ అయినవే..ESD క్లియర్ అయిన వాళ్ల భూములు కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డాయి. ముమ్మాటికీ ఇది మా అధికారుల తప్పే.. అధికారుల తరపున మంత్రి క్షమాపణలు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తామన్నారు. ప్రతి వారం ఉన్నతాధికారుల కమిటీ పరిశీలిస్తుంది..కేస్ బై కేస్ పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారని మంత్రి హామీ ఇచ్చారు.
22A నిషేధిత లిస్టులో చేర్చిన భూములను న్యాయమైన వాటిని ప్రొహిబిటెడ్ లిస్టునుంచి త్వరలోనే తొలగిస్తామన్నారు. ఏవైన సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబరు 1800 599 4788 కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.
ప్రైవేట్ ఆస్తుల యజమానులను ఇబ్బది పెట్టాలని మా ప్రభుత్వం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. న్యాయబద్దమైన ప్రజల ఆస్తులకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటదని అన్నారు మంత్రి పొంగులేటి.
