కాసేపట్లో భారత్ vs శ్రీలంక సెమీస్.. పిచ్ రిపోర్ట్, లైవ్ మ్యాచ్ ఎక్కడ చూడాలో తెలుసా?

కాసేపట్లో భారత్ vs శ్రీలంక సెమీస్.. పిచ్ రిపోర్ట్, లైవ్ మ్యాచ్ ఎక్కడ చూడాలో తెలుసా?

India vs Sri Lanka: ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు అత్యంత ఉత్కంఠభరితమైన రెండో సెమీఫైనల్‌లో తలపడటానికి సిద్ధమయ్యాయి. కాసేపట్లో ( అక్టోబర్ 1, 2026 గురువారం) నాగోయాలోని కోరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇరు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ, ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఏ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ కూడా ఫలితాన్ని తేల్చలేకపోయింది. మ్యాచ్‌లు జరగకపోవడంతో, ఐసీసీ ర్యాంక్ ఆధారంగా భారత్, శ్రీలంక నేరుగా సెమీ-ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాయి.

పిచ్ రిపోర్ట్, వాతావరణ నివేదిక: 

కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగే ఈ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో పిచ్, వాతావరణ పరిస్థితులు అత్యంత కీలకం కానున్నాయి. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా గతంలో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ పూర్తిగా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో పిచ్ కండిషన్స్, అవుట్‌ఫీల్డ్ తేమతో కూడి ఉండే అవకాశం ఉంది. బౌలర్లకు ప్రారంభ ఓవర్లలో పిచ్ నుంచి కొంత సహకారం లభించే అవకాశం ఉన్నప్పటికీ, వర్షం ప్రభావం మ్యాచ్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. 

లైవ్ స్ట్రీమింగ్, ప్రసార వివరాలు: 

వర్షం వల్ల గత మ్యాచ్‌లు రద్దయినప్పటికీ ఫైనల్ బెర్త్ కోసం తలపడేందుకు ఇరు జట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇవాళ్టి (అక్టోబర్ 1, 2026) మ్యాచ్  కోరోగి స్పోర్ట్స్ పార్క్, నిస్షిషన్‌లో జరిగే ఈ మ్యాచ్ ఉదయం 10:00 గంటలకు (IST) ప్రారంభం కానుండగా, కాసేపట్లో (ఉదయం 9:30 గంటలకు) టాస్ పడుతుంది. భారతదేశంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network) ద్వారా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా, సోనీలివ్ (SonyLIV) యాప్, వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు.