ఏసీబీకి చిక్కిన మొయినాబాద్ టీపీవో, సీనియర్ అసిస్టెంట్..

ఏసీబీకి చిక్కిన మొయినాబాద్ టీపీవో, సీనియర్ అసిస్టెంట్..

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్​అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మున్సిపాలిటీ పరిధిలోని ఓ వ్యక్తి తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. దీనికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఉండేందుకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యెలమోని సుదర్శన్‌‌ రూ.75 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

వారి సూచన మేరకు బుధవారం సుదర్శన్​కు రూ.75 వేలు ఇవ్వగా.. అక్కడే ఉన్న హైదరాబాద్ సిటీ రేంజ్–2 డీఎస్పీ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. లంచం డబ్బులను స్వాధీనం చేసుకొని, సుదర్శన్, వాణిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.