పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారంటూ టౌన్‌లోని మున్నువాడకు చెందిన బుర్కని బాలకృష్ణ దంపతులు ఆదివారం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో బాలకృష్ణ దంపతులు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా కాలనీలోని తనకు, పార్థసారథి పంతులుకు గొడవ జరిగిందని, మరునాడు తాను పార్థసారథి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పానని, అయినప్పటికీ తనను పోలీసులు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొట్టినట్లు చెబితే మీపై కేసులు బెడతామని పోలీసులు బెదిరించినట్లు వాపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని వారు డిమాండ్‌చేశారు. గత 26 ఏండ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నానని, పార్టీలో కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
