ఫిల్మ్ చాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. ఫెడరేషన్ సమావేశంలోకి దూసుకెళ్లిన సుమలత.. వాగ్వాదం!

ఫిల్మ్ చాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. ఫెడరేషన్ సమావేశంలోకి దూసుకెళ్లిన సుమలత.. వాగ్వాదం!

టాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫెడరేషన్ సమావేశంలోకి జానీ మాస్టర్ భార్య సుమలత వర్గం దూసుకెళ్లంది. ఫెడరేషన్ నాయకులతో వాగ్వాదానికి దిగారు.. సమావేశానికి తనను ఎందుకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. చాంబర్ బయట  సుమలత ఆందోళనకు దిగారు. దీంతో  సుమలతకి 23 క్రాఫ్ట్ లకు మధ్య  వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. సుమలతకి మద్దతుగా పలువురు  డాన్సర్లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా  డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిని సమావేశానికి ఎందుకు అనుమతించలేదని  సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను జానీ మాస్టర్ వైఫ్ అయినందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారని  ఆరోపించారు. నన్ను తప్పించింది కూడా అందుకే  . జాని మాస్టర్ కు నేను భార్యనే, కానీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను కాదా.. నన్ను ఎలా టార్గెట్ చేస్తారు ?  అని సుమలత ప్రశ్నించారు. నా ఫైట్ నాది.. జాని మాస్టర్ కి నాకు సంబంధం ఏంటి?  నా మీద కోపాన్ని జాని మాస్టర్ మీద చూపిండం.. నాన్ కోపరేషన్ పెట్టడం ఏంటి?  అని ప్రశ్నించారు. ఆయనను ఇండస్ట్రీలో లేకుండా చేయాలి కుట్ర చేస్తున్నారని  సుమలత ఆరోపించారు..

మరో వైపు సుమలత ఆరోపణలపై  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం కేసింది. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని పై ఆమె లేనిపోని బురద జల్లుతున్నారు.  వ్యక్తిగత విమర్శలతో  సుమలత వ్యవహరించడం  సరికాదని హితవు పలికారు. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో ఫెడరేషన్ కూడా అందరికి ఆమోదయోగ్యమైన సూచనలు చేసిందని  ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణ  చెప్పారు

అందరూ కలసి మెలసి పని చేసుకుంటుంటే ప్రాంతాలు పేర్లతో సుమలత విభేదాలు సృష్టిస్తున్నారు23 క్రాఫ్ట్స్ అధ్యక్షులు, ఫెడరేషన్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి వెల్లంకి శ్రీనివాస్  మండిపడ్డారు. వ్యకి కాదు వ్యవస్థ ముఖ్యం  మేము తిరగబడితే వేరే గా ఉంటుంది. వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడు కోమని చెప్పాము . కానీ సుమలత అసత్య ప్రచారాలు చేస్తూ.. వ్యక్తగత ఆరోపణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుమలత దేవి కి మద్దతుగా డాన్సర్స్ 12 మంది చేతులెత్తితే 250 మంది డాన్సర్స్ వ్యతిరేకించారని ఫెడరేషన్ గుర్తుచేసింది. ఆంధ్ర తెలంగాణ యూనియన్ల తో ఫెడరేషన్ కలసి పని చేస్తుంది . సీఎం రేవంత్ రెడ్డి  సినీ కార్మికులకు అండగా ఉంటాము అని చెప్పారు. కానీ ఇలాంటి టైమ్ లో ఫెడరేషన్ మీద సుమలత బురద జల్లుతున్నారని ఫెడరేషన్ సీరియస్ అయింది.  ఆమె వివాదాలను సృష్టించడం మానుకోవాలని వారు హితవు పలికారు.