దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ఊగిసలాడిన సూచీలు చివరికి ఊహించని నష్టాలను మిగిల్చాయి ఇన్వెస్టర్లకు. దీంతో ఒక్కరోజులోనే దేశీయ ఇన్వెస్టర్ల సంపద రూ.9 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది బీఎస్ఈలో.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ 570 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 198 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 182 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 600 పాయింట్ల నష్టంతో కొత్త నెల మెుదటి రోజును క్లోజ్ చేశాయి. దీంతో వరుసగా 8 వారాల పాటు సూచీలు నష్టాలతో క్లోజ్ కావటం 25 ఏళ్ల తర్వాత జరగటంతో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కూడా ఇదే నెగటివ్ ట్రెండ్ కొనసాగుతుందనే భయాలు వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : వెనక్కి తగ్గిన వ్యాపారులు.. అక్టోబర్ 2న UPI పేమెంట్స్‌కి ఓకే!
ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లను వీడటమే ఈ నష్టాలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. పడిపోతున్న రూపాయి, నెగటివ్ రిటర్న్స్, అధిక పన్నులు వంటి అనేక కారణాలతో టెక్ బేస్ట్ మార్కెట్లలోకి, బాండ్స్ వంటి ఇతర పెట్టుబడి మార్గాల్లోకి తమ సంపదను తరలిస్తున్నారు. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగటం, రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చితే పడిపోతుండటం కూడా మార్కెట్లో ప్యానిక్ క్రియేట్ చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
