తమిళ స్టార్ హీరో, ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం 'జననాయగన్' జూలై 23, 2026న భారీ అంచనాలతో థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో పెద్దగా అలరించలేక పోయింది. పైరసీ లీకులు సైతం ఈ మూవీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో నిరాశపరిచిన తమిళనాట మాత్రం కాసులు వర్షం కురిపించింది.
అయినా ఈ 'జననాయగన్' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.321 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మూడో వారానికీ సినిమా రూ.319 కోట్లకు పైగా సాధించగా, ఆ తర్వాత వసూళ్లు మరింత పెరిగాయి. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో 'జననాయగన్' అగ్రస్థానంలో నిలిచింది. సినిమా కమర్షియల్‌గా ఎంతవరకు లాభాలు అందించిందనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, విజయ్ స్టార్ పవర్‌ను మాత్రం ఈ కలెక్షన్లు మరోసారి చాటిచెప్పాయి.
ఇక ఇప్పుడు అసలు ట్రీట్ మొదలుకానుంది. థియేట్రికల్ రన్ ముగించుకున్న 'జననాయకన్' ఆగస్టు 21 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ చివరి చిత్రం కావడంతో ఓటీటీ రిలీజ్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. సినిమా తమిళంతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంంది.
►ALSO READ | అనసూయపై పీఎస్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు.. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫైర్!
ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం విజయ్ అభిమానులకు కేవలం మరో సినిమా కాదు.. తమ హీరోను వెండితెరపై చివరిసారిగా చూసే ఎమోషనల్ ఛాన్స్ గా భావించారు.
థియేటర్లలో కలెక్షన్లతో తన సత్తా చూపించిన 'జననాయగన్'.. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. విజయ్‌కి ఇది వీడ్కోలు కావచ్చు.. కానీ దళపతి విజయ్ క్రేజ్‌కు మాత్రం ఎండ్ కార్డ్ లేదని ఈ సినిమా మరోసారి నిరూపించింది..
