ఢిల్లీ: బీజేపీ అధిష్టానం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మంది సీనియర్ నాయకులను నియమించింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌లతో పాటు మరికొందరు సీనియర్ నాయకులను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించింది.
BJP chief Nitin Nibin announces names of new office bearers.
— ANI (@ANI) August 17, 2026
Vasundhara Raje Scindia, Tirath Singh Rawat, Ram Madhav, Baijyant Jay Panda, D Purandeshwari, Rekha Verma, Varshaben Narendrabhai Doshi, Bharti Pravin Pawar, Manpreet Singh Badal, Lal Singh Arya, M. Nagaraja, Tariq… pic.twitter.com/dnPE95CDVY
మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులవడం గమనార్హం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నియామకాలను ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.
జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన 13 మంది నాయకులలో రాజే, మాధవ్‌లతో పాటు ఈ జాబితాలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్, బైజయంత్ జే పాండా, డి పురందేశ్వరి, రేఖా వర్మ, వర్షబెన్ నరేంద్రభాయ్ దోషి, భారతీ ప్రవీణ్ పవార్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ఎం నాగరాజా, తారిఖ్ మన్సూర్, మధుచంద్ర కర్ ఉన్నారు.
బీజేపీ ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులను నియమించింది. ఈ జాబితాలో స్మృతి ఇరానీతో సహా వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా ఉన్నారు. బీజేపీ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా కొనసాగనుండటం గమనార్హం.
►ALSO READ | మోదీ ప్రభుత్వం, గుజరాత్ అభివృద్ధి మోడల్ పై..అన్నామలై సంచలన వ్యాఖ్యలు
శివప్రకాష్, సౌదాన్ సింగ్‌లు జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (సంస్థాగత)గా నియమితులయ్యారు. పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. రాజేష్ మంగళ్ జాతీయ సంయుక్త కోశాధికారిగా నియమితులయ్యారు. పార్టీ తన సంస్థాగత, ప్రచార విభాగాలలో కూడా నియామకాలను ప్రకటించింది. సంబిత్ పాత్రా ఈశాన్య ప్రాంత కోఆర్డినేటర్‌గా నియమితులవ్వగా, తరుణ్ చుగ్ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు.
జాతీయ స్థాయిలో నియమించిన ఈ టీంలో తెలంగాణ నుంచి ఒక్క బీజేపీ సీనియర్ నేత పేరు కూడా లేకపోవడంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
