గుజరాత్ అభివృద్ది మోడల్ పై మాజీ బీజేపీ నేత,విది లీడర్స్ ఉద్యమ వ్యవస్థాపకుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ది విషయంలో అనుసరిస్తున్న గుజరాత్ విధానాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు, క్రీడా వేదికలు ఒకే రాష్ట్రానికి పరిమితం కాకూడదని అన్నారు. అభివృద్ధి అవకాశాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలని, దేశ సమగ్ర వృద్ధికి ఇది అవసరమని అన్నామలై స్పష్టం చేశారు. గుజరాత్ మోదీ అమిత్ షా సొంత రాష్ట్రం కాబట్టే పెట్టుబడులు, అభివృద్ధి పనులన్నీ ఆ రాష్ట్రానికే కేటాయిస్తున్నారని ఆరోపించారు.
ఎన్డీయే ప్రభుత్వంలో దేశ అభివృద్దికి సంబంధించిన నిర్ణయాలన్నీ ఢిల్లీకేంద్రంగా జరుగుతున్నాయన్నారు అన్నామలై.రాష్ట్రాలకు, రాష్ట్రస్థాయి నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇది చాలా దురదృష్టకరం అని అన్నారు. నిర్ణయాలు తీసుకొని వారిపై చర్యలు చేపట్టాలంటే రాష్ట్ర స్థాయి నేతలకు మరింత అధికారం ఇవ్వాలని అన్నారు. గుజరాత్ కేంద్రంగా సాగుతున్న ఢిల్లీ అభివృద్ధి మోడల్ ఖచ్చితంగా మారాలని అన్నామలై డిమాండ్ చేశారు.
అన్ని ఏఐ కంపెనీలు, క్రీడా నిర్వహణ కార్యక్రమాలు అన్నీ గుజరాత్ కే పోతున్నాయి. భవిష్యత్తులో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, పోలీస్ గేమ్స్,2036 ఒలిటంపిక్ గేమ్స్ అహ్మదాబాద్ కు వె ళ్లకూడదు.. ఒకే రాష్ట్రానికి అవకాశాలు ఇస్తే దేశ అభివృద్దికి ఆటంకం అని అన్నామలై అన్నారు.
ALSO READ: కావేరీ జలాల వివాదంపై సుప్రీం కీలక తీర్పు..
పెట్టుబడులు, వివిధ అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహణలో గుజరాత్ కు ఇస్తున్న అవకాశాలు చర్చనీయాంశరమైన క్రమంలో అన్నామలై ఈ వ్యాఖ్యలు చేశారు
