ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. గురువారం ( అక్టోబర్ 1 ) సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డీఏకు సమ్దబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉద్యోగులు, పెన్షనర్ల రెండు డీఏలకు ఆమోదం తెలిపింది క్యాబినెట్.
క్యాబినెట్ భేటీలో ఇతర కీలక నిర్ణయాలు:
పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఆమోదం:
- గట్టు ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర క్యాబినెట్.
- ఇందిరా సాగర్ కెనాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
- బాచారం హైలెవెల్ కెనాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది క్యాబినెట్.
- చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపింది క్యాబినెట్.
లిక్కర్ పాలసీపై కీలక నిర్ణయాలు:
2బీ బార్లలో అడిషనల్ ప్రివిలేజ్ ఫీజు పెంచాలని నిర్ణయించింది క్యాబినెట్.గతంలో ఉన్న నిబంధనలను సడలిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. వైన్ తయారీ కంపెనీల నుంచి వెయ్యి రూపాయల ఫీజు వసూలు చేసేందుకు సన్నాహాలు చేపట్టాలని నిర్ణయించింది. ఫారిన్ లిక్కర్ బేస్ ప్రైస్ కమిటీ 2023 రిపోర్ట్ అమలు చేయాలని నిర్ణయించింది క్యాబినెట్.
