హైదరాబాద్ పబ్లిక్ కు గుడ్ న్యూస్ చెప్పింది TGSRTC. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులకు కలిపి ఒకే పాస్ విధానం అమల్లోకి తెచ్చింది. శుక్రవారం ( అక్టోబర్ 2 ) నుంచే ఈ పాస్ అమల్లోకి వస్తుందని తెలిపింది ఆర్టీసీ. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆర్టీసీ, మెట్రో రైల్ జాయింట్ పాస్ తో ఆర్టీసీ బస్సు, మెట్రో రైల్ లో ప్రయాణించే సదుపాయం అందుబాటులోకి రానుంది.
కామన్ పాస్ విధానంలో రోజు వారి పాస్ రూ. 400, నెల వారి పాస్ రూ. 8, 500 ఖరారు చేసింది ఆర్టీసీ. ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ కూడా తీసుకోచ్చింది ప్రభుత్వం. ఈ విధానం ద్వారా కండక్టర్ తో పని లేకుండా మొబైల్ లోనే టికెట్ పొందే సదుపాయం ఉంటుంది.
ఫిజికల్ టికెట్ అవసరం లేకుండా మొబైల్ లోనే టికెట్ పొందే సదుపాయం తీసుకొచ్చింది.ఈ మేరకు వారం రోజుల పాస్ ను సైతం తీసుకోచ్చింది ఆర్టీసీ.
మీ టికెట్ యాప్ ద్వారా మొబైల్ లోనే రోజు వారి టికెట్, డే పాస్, వారం రోజుల బస్ పాస్, నెల వారి బస్ పాస్ పొందే సదుపాయం కల్పిస్తోంది ఆర్టీసీ. అప్ గ్రేడ్ చేసిన మీ టికెట్ ను రేపు ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
