ఫ్లైదుబాయ్ (flydubai) విమానంలో పైలట్‌పై కో-పైలట్ దాడి చేసిన ఘటన, ఏడాది క్రితం ఆ పైలట్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. విమానంలో అత్యవసర పరిస్థితి (Emergency) తలెత్తితే క్యాబిన్ క్రూ ఎంత కీలకమో వివరిస్తూ భారత పైలట్, ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఏడాది క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "ఆకాశంలో విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మిమ్మల్ని ఎవరు కాపాడతారు ? ప్రయాణికులు చాలామంది విమాన సిబ్బందిని కేవలం ఆహారం, సేవలు అందించే వారిగానే చూస్తారు. కానీ పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు మిమ్మల్ని కాపాడేది వారే" అని అన్నారు. ఆయన అన్న ఆ మాటలు ఇప్పుడు ఆయన జీవితంలోనే నిజం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో అసలు ఏం జరిగింది?
దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని, తీవ్రమైన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. విమానం గాల్లో ఉండగా, కాక్‌పిట్ (పైలట్ రూమ్) లోపల ఉన్న ఒమానీ కో-పైలట్ హఠాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై భౌతిక దాడికి దిగాడు. ఈ దాడిలో స్మిత్ మచ్ఛర్ తీవ్రంగా గాయపడినప్పటికీ, సమయస్ఫూర్తితో కాక్‌పిట్ డోర్‌ను అన్‌లాక్ చేయగలిగారు. డోర్ తెరుచుకోవడంతో వెంటనే క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన కో-పైలట్‌ను పట్టుకున్నారు. తరువాత విమానాన్ని వెంటనే దారి మళ్లించి, సౌదీ అరేబియాలోని 'తబూక్' విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఈ ఘటనతో విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
ఏడాది క్రితం ఓ ఇంటర్వ్యూలో స్మిత్ మచ్ఛర్ చెప్పినట్లే విమానంలో ఊహించని ప్రమాదం ఎదురైనప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే ఏమీ చేయలేడు. పైలట్లు, సిబ్బంది ఇంకా ప్రయాణికులు అందరూ కలసికట్టుగా స్పందిస్తేనే ప్రాణాలు కాపాడుకోగలరు అనేది ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.
Also Read : ఆస్ట్రేలియా చరిత్రలోనే తొలి భారతీయ మహిళా...
తాను ఒకప్పుడు ఉదాహరణగా చెప్పిన అత్యవసర పరిస్థితిలోనే, స్మిత్ మచ్ఛర్ స్వయంగా చిక్కుకోవడం ఇంకా ఆయన చెప్పినట్లే సిబ్బంది, ప్రయాణికులు కలిసి అందరి ప్రాణాలను కాపాడడం విశేషం.
🇮🇳 A year-old interview with FlyDubai’s HERO PILOT Capt. Smit Machchar broke down the importance of the plane’s crew.
— Mario Nawfal (@MarioNawfal) September 30, 2026
“When we are up there and if something happens, who’s going to save you?
It is unfortunate, the outlook of people toward the crew.
But when things are going…
