వీకెండ్ వచ్చేసింది.. పైగా గాంధీ జయంతి ( అక్టోబర్ 2న) హాలిడే కూడా కలిసొచ్చింది. దీంతో సినిమా లవర్స్‌కు ఈసారి వరుసగా సినిమాల జాతర మొదలవుతోంది. ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతుంటే.. మరోవైపు ఓటీటీల్లో కూడా కొత్త కంటెంట్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. మరి ఈ వీకెండ్ ఏ సినిమాలు ఎక్కడ సందడి చేయబోతున్నాయో చూద్దాం...
థియేటర్లలో కొత్త సినిమాల సందడి
ఈ శుక్రవారం ( అక్టోబర్ 2న) థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ప్రత్యేకంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ ఆక్షన్ థ్రిల్లర్ ఇది.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇక దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న 'సిగ్మా' కూడా ఈ వీకెండ్ ( అక్టోబర్ 2 ) థియేటర్లలో సందడి చేయనుంది. తండ్రి స్టార్ హీరోగా భారీ క్రేజ్ సంపాదించగా.. ఇప్పుడు కొడుకు దర్శకుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. కమర్షియల్ ఎలిమెంట్స్ ప్లస్ స్టెలిష్ మేకింగ్‌తో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
ఇవే కాకుండా మనసుని హత్తుకునే ప్రేమకథలతో 'తెల్ల కాగితం', 'అనకాపల్లి', 'ప్రేమనే ఊరిలో' లాంటి యూత్‌ఫుల్ డ్రామాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హాలిడే కలిసిరావడంతో ఈ చిత్రాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రేక్షకాదరణ దక్కే అవకాశం ఉంది.
OTTలో మరింత జోష్..
థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా కొత్త సినిమాలు, సిరీస్‌లతో రెడీ అయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్, కల్ట్ డివోషనల్ డ్రామాలు, ఇంటర్నేషనల్ కంటెంట్ రాజ్యమేలబోతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)
'మహేంద్రగిరి వారాహి' - అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చి థియేటర్లలో ప్రశంసలు అందుకున్న టాలీవుడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో మిస్ అయిన తెలుగు ప్రేక్షకులకు ఇది మంచి ఆప్షన్.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
'#లవ్' (తెలుగు డబ్బింగ్ సిరీస్) (అక్టోబరు 02) : నేటితరం సంబంధాలు, ప్రేమకథల చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా.
'డూయింగ్ లైఫ్' (అక్టోబరు 02): హాలీవుడ్ ప్రముఖ మేకర్ టైలర్ పెర్రీ అందించిన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ లీగల్ డ్రామా.
'షూమాకర్ '94: ద బర్త్ ఆఫ్ ఏ లెజెండ్' (అక్టోబరు 02): - ఎఫ్1 రేసింగ్ దిగ్గజం మైకేల్ షూమాకర్ కెరీర్ ప్రారంభ దినాలపై వచ్చిన గూస్‌బంప్స్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ.
'బ్లూ బాక్స్' (సీజన్ 2) - (అక్టోబరు 4న ): పాపులర్ జపనీస్ యానిమే సిరీస్ సెకండ్ సీజన్.
జియో హాట్‌స్టార్ (JioHotstar)
'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' - (అక్టోబరు 02): మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. కుటుంబ నేపథ్యంలో సాగే కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా ఆసక్తికరంగా ఉండొచ్చు..
'వార్' (War) - (అక్టోబరు 3న): మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ మరియు విజువల్స్ కలిగిన హాలీవుడ్ ఆక్షన్ థ్రిల్లర్.
ట్రాకర్ (సీజన్ 4) , మార్షల్స్ (సీజన్ 2) ఇంగ్లీష్ థ్రిల్లర్ సిరీస్‌లు క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రియుల కోసం రెడీ ( అక్టోబరు 4న ) అయ్యాయి.
జీ5 (ZEE5)
'ఈవిల్ డెడ్ బర్న్' - (అక్టోబరు 2): హారర్ లవర్స్‌ను భయపెట్టేందుకు వస్తున్న తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ ఫిల్మ్.
'పూజా మేరీ జాన్' (హిందీ) , 'మదర్ ప్రామిస్' (కన్నడ) : ఈ రెండు- ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా కంటెంట్ తో అక్టోబరు 2న స్ట్రీమింగ్ కానున్నాయి
'మడగాస్కర్: ఏ లిటిల్ వైల్డ్ '- (అక్టోబరు 2) కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం యానిమేటెడ్ ఎంటర్‌టైనర్ సిద్ధంగా ఉంది.
యాపిల్ టీవీ ( Apple TV )
'ద లాస్ట్ ఫస్ట్: వింటర్ K2' (యాపిల్ టీవీ) -: ప్రాణాలకు తెగించి కె-2 శిఖరాన్ని అధిరోహించే అడ్వెంచరస్ ఇంగ్లీష్ సర్వైవల్ మూవీ ఇది. అక్టోబరు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది..
హెచ్‌బీఓ మ్యాక్స్ (HBO Max)
'ఈవిల్ డెడ్ బర్న్' ( అక్టోబరు 2) -: అత్యంత భయానక వాతావరణాన్ని సృష్టించే మైండ్ బెండింగ్ హారర్ ఫిల్మ్ ఇది
మొత్తానికి.. థియేటర్‌లో కొత్త సినిమాల సందడి, ఇంట్లో OTT బింజ్.. ఈ హాలిడే వీకెండ్ సినిమా ప్రియులకు ఫుల్ మీల్స్ ప్యాకేజీ సిద్ధంగా ఉంది. ఈ లాంగ్ వీకెండ్‌లో మీ ఫేవరెట్ మూవీస్, షోలను వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మరి.
