రెండు డీఏల నిర్ణయంపై టీఎన్జీవో నేతల హర్షం

రెండు డీఏల నిర్ణయంపై టీఎన్జీవో నేతల హర్షం
  •  పెండింగ్ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు రెండు డీఏలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించడంపై టీఎన్జీవోస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

]రెండు డీఏలు విడుదల చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి టీఎన్జీవోస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

మిగిలిన పెండింగ్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా పీఆర్సీ రిపోర్టును తెప్పించుకొని.. 51 శాతం ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌తో కొత్త పే స్కేల్‌‌‌‌ను అమలు చేయాలని మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనీ విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగేలా బిల్లులను మంజూరు చేయాలని వారు కోరారు.