గాంధీ భవన్ ముట్టడికి 317 జీవో బాధితుల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు

గాంధీ భవన్ ముట్టడికి 317 జీవో బాధితుల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: జీవో నంబర్ 317తో సొంత జిల్లాలకు దూరమైన ఉద్యోగులను తిరిగి వారి ప్రాంతాలకు కేటాయించాలని డిమాండ్​చేస్తూ పలువురు బాధితులు శుక్రవారం గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ ఈ జీవోతో భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వన్ టైమ్ రిలీఫ్ కింద సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ జీవోపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​చేశారు.