మనం ఎంచుకునే కెరీర్ మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునే శక్తి మన కెరీర్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ రాశి వారు ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవాలి అన్న డైలమాలో ఉన్నవాళ్లకు జ్యోతిష్యం చూపిస్తున్న చక్కని పరిష్కార మార్గాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మీ రాశిని బట్టి..మీరు ఎందులో..రాణిస్తారు.. అనే విషయం గురించి జ్యోతిష్య శాస్త్రంలో చక్కగా వివరించారు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలని.. మంచి కెరీర్ ఎంచుకోవాలని.. ఉన్నత స్థానానికి వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కెరీర్ ఛాయిస్ లో వేసే తప్పటడుగులే వాళ్ల ఫెయిల్యూర్ కి కారణమవుతుంటాయి. కొంతమంది వాళ్లు ఎంచుకున్న దారిలో అద్భుతమైన విజయం సాధిస్తారు. అయితే టాలెంట్ ని..మీ చదువుని, మీరు చేసిన డిగ్రీని, ఆర్థిక స్థోమతను బట్టి ఎంచుకుంటారు. కొంతమంది ఇష్టం లేకపోయినా, అదే ప్రొఫెషన్ లో వెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్లు వెళ్తున్న దారిని ఎంజాయ్ చేస్తారు.
మేషరాశి: ఈ రాశి వారికి తెలివితేటలు .. ఆలోచన శక్తి చాలా ఎక్కవుగా ఉంటుంది. వీరు చాలా పట్టుదల కలిగి ఉంటారు. వీళ్లు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు. మిలట్రీ, రాజకీయాలు, రెస్క్యూ వర్క్ లో రాణించగలుగుతారు. అలాగే పారిశ్రామిక వేత్తలుగా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి : ఈ రాశి వారు చాలామంది హార్ట్ వర్క్ చేస్తారు. వీరు అందంగా ఉండి.. లగ్జరీ లైఫ్ ను ఇష్ట పడతారు. డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు. ఎక్కువుగా టెక్నికల్ రంగంలో సక్సెస్ సాధిస్తారని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
మిథునరాశి : ఈ రాశి వారికి సాధారణంగా కలివిడితనం ఎక్కువుగా ఉంటుంది. అందరితో కలిసి ఉండేందుకు చాలా ఇష్టపడుతుంటారు. వీరు ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. వీళ్లకు వాక్ చాతుర్యం ఎక్కువుగా ఉంటుంది. వీరు మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఈ రాశి వారి మనస్తత్వానికి ఫైనాన్స్ వ్యాపారంలో బాగా రాణించే అవకాశం ఉంది. వీళ్ల టాలెంట్ కు బ్యాంకింగ్ రంగం.. బంగారం వ్యాపారం , మార్కెటింగ్, సేల్స్ జాబ్స్ బాగా కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి : ఈ రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా చాలా ఈజీగా పరిష్కరిస్తారు. వీరు చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. వీళ్లు టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్, గార్డెనర్స్ జాబ్స్ కి బాగా సూట్ అవుతారు.
సింహ రాశి : ఈ రాశి వారి పర్సనాలిటీకి తగ్గట్టు చాలా మంచి కెరీర్ ఉంటుంది. వీళ్లకు భయమంటే తెలియదు. వీళ్లు కెరీర్ లో బాగా ఉన్నతస్థానానికి చేరుకుంటారు.అలాగే డబ్బులు సంపాదిస్తారు.
వీళ్లు సీఈవో, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ సాధిస్తారు.
కన్యారాశి: ఈ రాశి వాళ్లు చాలా లాజికల్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు. వీళ్లు ఎడిటింగ్, రైటింగ్ జాబ్స్, రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలసిస్ జాబ్స్ లో సెటిల్ అవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
తులా రాశి : ఈ రాశి వాళ్లు చాలా మంచి తెలివైనవారు. వీరికి ఎదుటివారి ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది. ఇతరులు చెప్పే విషయాలను చాలా ఓపికగా వింటారు. వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటివాళ్లను ఆకట్టుకుంటాయి. ఈ రాశి వారు రాజకీయ నాయకులుగా.. ఉన్నతాధికారులుగా.. మంచి పరపాలన దక్షత కలిగిన రంగాల్లో సక్సెస్ సాధిస్తారు. న్యాయవాది, పోలీస్ అధికారి, డాక్టర్ వంటి వృత్తులు బాగా కలిసివస్తాయి.
వృశ్చికరాశి : ఈ రాశి వారికి చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు. వీళ్లు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ వంటి ప్రొఫెషన్స్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి : ఈ రాశి వాళ్లు చాలా సైలెంట్ గా ఉంటారు. ట్రావెలింగ్ ను ఇష్టపడతారు. జీవిత పరమార్థం గురించా తెలుసుకొనేందుకు ఆశక్తి చూపుతారు. ఎక్కువగా ఆధ్మాత్మిక విషయాల గురించి ఆలోచిస్తారు. వీళ్లు ఇతరులను ప్రేరేపించడానికి, కోచింగులు ఇవ్వడానికి, మంత్రులుగా, ఫిలాసఫర్లుగా రాణిస్తారు.
మకరరాశి : ఈ రాశి వారు ఎక్కువుగా చాలెంజ్ లైఫ్‌ను ఇష్టపడతారు.అప్పుడే సంతోషంగా ఉంటారు.
జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. చాలా మెచ్యూర్ గా ఉంటారు. వీళ్లు కెరీర్ ఎంపికలో ఐటీ, మెడిసిన్, బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
కుంభరాశి : ఈ రాశి వారు ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న విషయాలపై చాలా క్యూరియాసిటీగా ఉంటారు. కాబట్టి వీళ్లు మంచి సైంటిస్ట్ లు అయ్యే అవకాశాలున్నాయి. ఏరోనాటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు.
మీనరాశి: ఈ రాశి వారికి ఇతరులకు సహాయపడే గుణం ఉంటుంది. చాలా సృజనాత్మకంగా, పాషినేట్ గా ఉంటారు.వీళ్లు ఆర్టిస్ట్ కెరీర్ ఎంచుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. సినిమా రంగం.. టీవీ సీరియల్స్.. డ్రాయింగ్, డ్యాన్స్ వంటి రంగాల్లో విజయం సాధిస్తారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
