జ్యోతిష్యం : విధి రాత, అదృష్టం బట్టి జీవితం నడుస్తుందా లేక సంకల్పం, లక్ష్యం ఆధారంగా జీవితం సాగుతుందా..?

జ్యోతిష్యం : విధి రాత, అదృష్టం బట్టి జీవితం నడుస్తుందా లేక సంకల్పం, లక్ష్యం ఆధారంగా జీవితం సాగుతుందా..?

ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో లైఫ్​ సైల్​.. వారి అభిరుచులు.. సిద్దాంతాలు కూడా వేరేగా ఉంటాయి.  అందరిని ఆ పరమాత్ముడే సృష్టించినా  విభిన్న పద్దతులు.. అనేక రకాల మనస్తత్వాలు.. ఎందుకు కలిగి ఉంటారు.  ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో రకంగా ఎందుకుంటుంది.. ఆధ్యాత్మిక గ్రంధాల్లో మనుషుల జీవన శైలి గురించి ఎలా వివరించారు.. మొదలగు విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

మనుషులకు విధిరాతను బట్టి జీవితం నడుస్తుందా? లేక సంకల్పంతోనే నడుస్తోందా? ఈ సమస్యని లోతుగా పరిశీలిస్తే.. ఈ రెండింట్లో మనకు ఇష్టమైనదాన్ని లేదా మన జీవితానికి అనుకూలమైనదాన్ని ఎంచుకుంటాం.  మనకు ఎదురయ్యే కొన్ని పరిస్థితులు.. జీవితం మనల్ని ఎలా అణగదొక్కుతుందే రియలైజ్ అయ్యేలా చేస్తుంటాయి. అప్పుడు సహజంగానే, జీవితం ఎలా సాగాలో ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉందా? లేదా అనే సందేహం కలుగుతుంది.

ఉదాహరణకు మనం పాస్​ వర్ట్  ఉన్న ఒక లాకర్​ ను  ఓపెన్ చేయాలనుకున్నాం. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కంట్రోలింగ్ ఏజెన్సీ పంపే ఓటీపీ, రెండోది అంతకు ముందు మనం సెట్ చేసుకున్న పాస్​ వర్డ్. ఓటీపీని ఎంచుకున్న వాళ్ల జీవితాల్ని ప్రకృతే కంట్రోల్ చేస్తుంది. కంటికి కనపడని శక్తి ఏది ఇస్తే దాన్నే యాక్సెప్ట్ చేస్తారు వీళ్లు. 

కానీ మనుషులు తమ పాస్​వర్డ్ ను తామే సెట్ చేసుకోగలిగినంత శక్తివంతులు! ఈ నెంబర్ ఏదైనా కానీ, గతంలో దాన్ని ఎంచుకుని. ఉంటారు. పాస్​ వర్డ్ సెట్ చేసుకునే టైంలో తనకు ఇష్టమొచ్చిన నెంబర్​ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. 

కానీ, ఒకసారి సెట్ చేశారంటే దానికి పరిమితమై ఉంటారు. అచ్చంగా అలాగే, మనం కూడా కర్మ చక్రాన్ని మొదలు పెడతాం. అనంతమైన అవకాశాలు ఉంటాయి. కానీ, గతంలో చేసిన పనులు, స్వభావం ఆధారంగా అందులో ఏదో ఒకదాన్నే ఎంచుకుంటాం. ఇలా ఎంచుకున్న చాయిస్ మన ఫ్యూచర్ ఆప్షన్స్ కి హద్దులు నిర్ణయిస్తుంది. కాబట్టి, మనం దానికి లోబడి పని చేస్తుంటాం. కోరికల ఆధారంగా పని చేస్తూ వెళ్లడం వల్ల.. నెమ్మదిగా మనకు ఉండే ఒక్కో అవకాశం తగ్గిపోతూ ఉంటుంది.

గతాన్ని బట్టే..

గతంలో చేసిన కర్మల వల్ల మన పాస్ వర్డ్ ని మనం సెట్ చేసుకునే స్వేచ్ఛ తగ్గుతుంది. కేవలం యోగులకు మాత్రమే తమకు ఇష్టమైన జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే. వాళ్లు గతం తాలూకు కర్మసంకెళ్ల నుంచి ఇప్పటికే విముక్తి పొంది ఉంటారు. యోగిచేసే ప్రతి పనీకొత్తదే! కాబట్టి, అది చేసేందుకు అతనికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అతను సర్వతంత్ర స్వతంత్రుడు! గతంలో చేసిన కర్మలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయని. మామూలు మనుషులు రియలైజ్ అయ్యేందుకు యోగులు ఆదర్శంగా నిలుస్తారు. అప్పుడు పాస్​ వర్డ్​ ని  రీసెట్ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాం. అలాగే, జీవితాన్ని రీసెట్ చేసుకోవాలనుకుంటే గొప్పగొప్ప ప్రయత్నాలు చేయాలి.

ఎవరు కంట్రోల్ చేస్తున్నరు?

మరి తక్కువ ర్యాంక్ లో ఉండే మనుషులు ఎక్కడి నుంచి ఓటీపీ రిసీవ్ చేసుకుంటున్నారు? ఆ ఓటీపీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అంటే, అది శాశ్వతమైన ప్రకృతి, సత్వ, రజో, తమో అని మూడు రకాల గుణాలు ఈ గుణాలే అన్ని రకాల పరిస్థితులకు కారణం అవుతుంటాయి. ఈ గుణాల్ని బట్టే కష్ట, సుఖాలు ఉంటాయి.

  • సత్వగుణం: ఈగుణం తెల్లనిది, తేనె లాంటిది. ఇది సంతోషాన్ని ఇస్తుంది. 
  • రజోగుణం : ఈ గుణం ఎర్రనిది. మత్తులాంటిది. ఇది బాధ కలిగిస్తుంది. 
  • తమోగుణం: ఇది చీకటి విషం లాంటిది. ఇది అజ్ఞానానికి కారణమవుతుంది.

యోగిక్ ప్రాక్టీస్​ తో...

'మనం మన స్వభావానికి తగ్గట్టే ప్రవర్తిస్తాం... కర్మలు చేస్తుంటాం' అని గీతలో శ్రీ కృష్ణుడు అంటాడు. అద్వైత వేదాంతంలో ఈ ప్రకృతిని 'మాయ' అన్నారు. ఈ మాయే క్రియేటర్. ఆయనే అన్ని రకాల అనుభవాల్ని క్రియేట్ చేస్తాడు. తక్కువ ర్యాంక్​ లో ఉండే మనుషులు మాయాధీనులు అంటే వాళ్లు మాయకంట్రోల్లో ఉంటారు. దీన్నే విధిరాత అనుకుంటూ ఉంటారు. యోగిక్ ప్రాక్టీస్​ లో  సాధారణ మనుషులకంటే ఉన్నత ర్యాంక్​ లో ఉన్నవాళ్లు మాయాధీశులు, అంటే వీళ్లే మాయని కంట్రోల్ చేస్తారు. సంకల్ప శక్తితో వీళ్లు స్వేచ్ఛగా... ఇండిపెండెంట్ గా ఉంటారు.