సికింద్రాబాద్: జిమ్లో వర్కౌట్ చేసే ఫిట్నెస్ ఫ్రీక్స్కు స్టెరాయిడ్స్ సప్లయ్ చేస్తున్న ఆరుగురిని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి పలు నిషేధిత స్టెరాయిడ్స్తో పాటు మెడిసిన్స్ను పోలీసులు సీజ్ చేశారు.
ముషీరాబాద్ జిమ్స్లో జిమ్ చేసే యువకులకు బాడీ బిల్డ్ చేయడానికి నిందితులు ఇల్లీగల్గా వీటిని సప్లై చేస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆన్లైన్ యాప్స్ ఈ స్టెరాయిడ్స్ సిటీకి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి ఇల్లీగల్ మందులు వాడితే యువత బాడీలో అనేక ప్రాబ్లమ్స్ వచ్చి శరీరం కొన్నాళ్లకు ఎందుకూ పనికి రాకుండా పోతుందని పోలీసులు తెలిపారు.
సిటీలోని కొన్ని జిమ్సెంటర్లలో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడకం పెరుగుతోంది. ‘త్వరగా కండలు పెంచాలి. ఇంప్రెస్ చేయాలి’ అంటూ కొంతమంది యూత్ స్టెరాయిడ్స్వాడుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. కొంతమంది జిమ్ ట్రైనర్లు, నిర్వాహకులు కూడా యూత్ను తప్పుదోవ పట్టిస్తూ స్టెరాయిడ్స్కు అలవాటు పడేలా చేస్తున్నారు. కేవలం మూడు, నాలుగు నెలల్లోనే బాడీ షేప్మార్చేలా చేస్తామని, సిక్స్ ప్యాక్ తెప్పిస్తామని ప్రచారం చేసుకుంటూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు.
అనబాలిక్, ఆండ్రోజెన్స్టెరాయిడ్స్అదే పనిగా వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. లైంగిక సామర్థ్యం దెబ్బ తినడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. మానసిక సమస్యలు, హై బీపీ, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీల ఫెయిల్యూర్కూ కారణమవుతుంది. ఆండ్రోజెన్, అనాబాలిక్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి.
ALSO READ : హైదరాబాద్‌లో ఫుడ్ మాఫియా.. 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్..
కండరాల వ్యాధులతో పాటు కాలేయం చెడిపోతుందని, మానసిక సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక వంధ్యత్వానికి దారి తీస్తుందంటున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్పెరుగుతాయంటున్నారు. వీటితో పాటు కొందరు హై ప్రోటీన్ ఫుడ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండెలో సడెన్ బ్లాకేజెస్ ఏర్పడి హార్ట్స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది.
